- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Balakrishna: బాలయ్య మ్యాన్షన్ హౌజ్ యాడ్ చూశారా..? అదిరిపోయింది అంతే..
మ్యాన్ ఆఫ్ గాడ్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మ్యాన్ ఆఫ్ గాడ్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘అఖండ-2’(Akhanda-2) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఈ ఏజ్‌లోనూ యంగ్ హీరోస్‌కి బాలయ్య గట్టి పోటీ ఇస్తున్నాడు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ క్రమంలో బాలయ్య చేసిన ఓ యాడ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా హీరోలంతా యాడ్స్ చేస్తున్న సంగతి విదితమే. మహేష్ బాబు థంమ్సప్ డ్రింక్, వరుణ్ తేజ్ స్ప్రైట్ పానియంకి, చిరంజీవి కంట్రీ డిలైట్ మిల్క్‌కి అలా చాలా మంది హీరోలు యాడ్ చేయడం మనం చూస్తున్నాం. అయితే బాలయ్య కూడా యాడ్స్ మొదలుపెట్టారు.
ఇప్పటికే కొన్ని యాడ్స్ చేయగా తాజాగా మ్యాన్షన్ హౌజ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్‌కి యాడ్ చేశారు. తాజాగా ఆ యాడ్‌ని రిలీజ్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక ఈ యాడ్‌లో బాలకృష్ణ సింహం మీద సవారీ చేసుకుంటూ రావడం కొత్తగా ఉంది. సింహం, బాలయ్యని పక్కపక్కన పెట్టి యాడ్ చేయడం మరింత అదుర్స్ అనిపించింది. ఇక ఇందులో ఓ షూటర్ వచ్చి సింహంని కాలుద్దాం అనుకుంటే అంతలో బాలయ్య సింహం మీద సవారీ చేస్తూ వచ్చి ‘అన్నిటినీ లవ్ చెయ్ లయన్ హార్ట్‌తో వెల్కమ్ చెయ్.. జిందగీలో ఏదైనా దిల్ ఓపెన్ చెయ్ లైఫ్ వెల్కమ్ చెయ్..’ అంటూ బాలయ్య డైలాగ్ చెప్పి అలరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






