- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Balakrishna: 'డాకు మహారాజ్' చూసి బాలయ్యకు అభిమానులు ఫోన్
'డాకు మహారాజ్'(Daku Maharaj) సినిమా హిట్ సందర్భంగా సినీ నటుడు బాలకృష్ణ(Balakrishna) అభిమానులతో ఫోన్‌లో మాట్లాడారు.

దిశ, వెబ్ డెస్క్: 'డాకు మహారాజ్'(Daku Maharaj) సినిమా హిట్ సందర్భంగా సినీ నటుడు బాలకృష్ణ(Balakrishna) అభిమానులతో ఫోన్‌లో మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ(Nandamoori Balakrishna) హీరోగా బాబీ(Boby) దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి సందర్భంగా ఇవాళ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ యాక్షన్ కి తమన్ మ్యూజిక్ తోడై సినిమా అదిరిపోయిందని సినిమా లవర్స్ అంటున్నారు. ఈ క్రమంలో డాకు మహారాజ్ సినిమా చూసి బయటికి వచ్చిన అభిమానులు బాలయ్యతో ఫోన్ లో మాట్లాడారు.
బాలయ్య ఫ్యాన్స్ అధ్యక్షుడు(Balayya Fans President) గౌస్ మొయిద్దిన్(Gouse Moinuddin) మాట్లాడుతూ.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని, మీ నటనకు ఫిదా అయ్యామని, యాక్షన్, సెంటిమెంట్ సీన్లు బాగున్నాయని బాలకృష్ణకు చెబుతూ.. సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాక వరుసగా నాలుగు హిట్లు అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. అలాగే అనంతరం బాలయ్య ఫ్యాన్స్ అసోషియేషన్ మెంబర్ జగన్(Jagan) మాట్లాడుతూ.. బాలయ్యను నటనను తెగ మెచ్చుకున్నారు. డాకు మహారాజ్ సూపర్ హిట్ అని, వరుస విజయాలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, మీ అభిమానులు కావడం గర్వంగా ఉందని బాలయ్య అభిమాని జగన్ అన్నారు.






