పొరపాటున నా నటనకు పద్మ భూషణ్ ఇచ్చారు: బాలయ్య

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-10 10:29:55  IST  )

ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుపై నందమూరి బాల‌కృష్ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బిరుదుల‌కు తాను అలంకారం కానీ త‌న‌కు బిరుదులు అలంకారం కాద‌ని అన్నారు.

పొరపాటున నా నటనకు పద్మ భూషణ్ ఇచ్చారు: బాలయ్య
X

దిశ‌, వెబ్ డెస్క్: ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుపై నందమూరి బాల‌కృష్ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బిరుదుల‌కు తాను అలంకారం కానీ త‌న‌కు బిరుదులు అలంకారం కాద‌ని అన్నారు. ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును త‌న సేవ‌ను చూసి ఇచ్చార‌నుకుంటాన‌ని, న‌ట‌న‌కు కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. పొర‌పాటున ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును పొర‌పాటున‌ న‌ట‌న‌కు ఇచ్చి ఉంటార‌ని చెప్పారు. త‌న‌కు వ‌చ్చిన‌ ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డులో బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు, సిబ్బంది కృషి ఉంద‌ని అన్నారు.

అఖండ 2 సినిమా షూటింగ్ గురించి చెబుతూ ఇటీవ‌లే జార్జియాలో షూటింగ్ చేశామ‌ని తెలిపారు. షూటింగ్ స‌మ‌యంలో -4 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో స‌న్నివేశాలు చిత్రీక‌రించాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. అప్పుడు అంద‌రూ వ‌ణికిపోతుంటే తాను మాత్రం పైన‌ స్లీవ్ లెస్, కింద పంచ క‌ట్టుకుని అలానే నిల‌బ‌డిపోయా అని చెప్పారు. ఆ పాత్ర చేయ‌డం శివుడి ఆజ్ఞ‌గా భావిస్తానని చెప్పారు. అది త‌న పూర్వ‌జ‌న్మ సుకృతం అని భావిస్తాన‌ని తెలిపారు. ఎందుకంటే త‌న‌కు జన్మ‌నిచ్చిన ఎన్టీఆర్ ప్ర‌తిరూపాన్ని త‌న‌లో ప్రేక్ష‌కులు చూసుకుంటున్నార‌ని అన్నారు.

Next Story