Balakrishna Birthday Special: అఖండ-2 టీజర్ విడుదల.. అరాచకం కాదు.. అంతకుమించి!

by Chukka Sudharani |   (  Updated:2025-07-26 02:34:25  IST  )

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అఖండ-2’ టీజర్ రానే వచ్చింది.

Balakrishna Birthday Special: అఖండ-2 టీజర్ విడుదల.. అరాచకం కాదు.. అంతకుమించి!
X

దిశ, సినిమా: నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అఖండ-2’ టీజర్ రానే వచ్చింది. నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘అఖండ-2’ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి.. తాజాగా బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా’ అంటూ బాలయ్య బాబు డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో.. నందమూరి నటసింహం ఉగ్రరూపంలో కనిపించి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. టీజర్‌లోని ఒక్కో సీన్, VFX ఎఫెక్ట్స్, బాలకృష్ణ యాక్టింగ్ చూస్తే.. ఇది అరాచకం కాదు అంతకుమించి అన్నట్లు అనిపిస్తుంది. ప్రజెంట్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Link

Next Story