ధర్మం కోసం జీవించాలి.. సత్యం కోసం పోరాడాలి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బాలకృష్ణ

by Chukka Sudharani |

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2: తాండవం’.

ధర్మం కోసం జీవించాలి.. సత్యం కోసం పోరాడాలి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బాలకృష్ణ
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2: తాండవం’. తాజాగా కర్నాటకలో జరిగిన భారీ ఈవెంట్‌లో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘కన్నడ ప్రజలకు నమస్కారం. వర్షానికి లెక్కచేయకుండా ఇక్కడికి విచ్చేసిన తమ్ముడు శివన్న, అలాగే నా అభిమానులందరికీ హృదయపూర్వక కళాభివందనాలు. అఖండ కేవలం తెలుగు, కన్నడ సినిమా కాదు ఇది పాన్ ఇండియా సినిమా. కరోనాలో అందరూ భయపడుతున్న సమయంలో మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఆ సమయంలో అఖండను విడుదల చేశాం.

ఇందులో పిల్లలు ప్రకృతి ధర్మం జోలికి వస్తే భగవంతుడు మనుషులకి ఆవహిస్తాడు చూపించడం జరిగింది. యువత మీరందరూ మంచిదారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో మీరు చూస్తారు. బోయపాటితో నాకు ఇది నాలుగో సినిమా. నేను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర నన్ను ఆవహిస్తుంది. ధర్మం కోసం జీవించాలి సత్యం కోసం పోరాడాలి అన్యాయం ముందు తలవంచకూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. తమన్ థియేటర్లో బాక్సులు పేలిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ని మళ్ళీ ఇక్కడే జరుపుతాం. మూవీ చాలా అద్భుతంగా ఉంది. హిట్ కొడుతున్నాం’ అన్నారు.

Next Story