- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీ సీఎం యోగిని కలిసిన బాలకృష్ణ, అఖండ-2 చిత్ర యూనిట్.. త్రిశూలం బహుకరణ
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టాలివుడ్ ప్రముఖ నటుడు, నందమూరి బాలకృష్ణ, అఖండ చిత్ర యూనిట్ కలిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టాలివుడ్ ప్రముఖ నటుడు, నందమూరి బాలకృష్ణ, అఖండ చిత్ర యూనిట్ కలిసింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ-2 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సనాతన ధర్మం నేపథ్యంలో తీసిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ మేరకు యూపీ సీఎం యోగిని బాలకృష్ణతో పాటు చిత్ర బృందం కలిసింది. సీఎం యోగిని కలిసిన వారిలో బాలయ్యతో పాటు సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్, నిర్మాతలు, తదితర నటులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎంకు చిత్ర యూనిట్ త్రిశూలం బహుకరించి, జ్ఞాపికను అందజేశారు. టీమ్‌కు సీఎం యోగి ఆదిత్యనాథ్ విషెస్ తెలిపారు. కాగా, ఇటీవల అఖండ-2 ట్రైలర్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ.. ఒక సాధారణ వ్యక్తి, మరోవైపు అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్ర పోషించారు. బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగులు, విజువల్స్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది.






