- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
World Book of Records : భారతీయ సినిమాలో మొదటి నటుడుగా అద్భుతమైన ఘనత సాధించిన బాలకృష్ణ
by Chukka Sudharani |
నందమూరి నటసింహం, మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అద్భుతమైన విజయాన్ని సాధించారు.

X
దిశ, సినిమా: నందమూరి నటసింహం, మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అద్భుతమైన విజయాన్ని సాధించారు. భారతీయ సినిమాలో హీరోగా అద్భుతమైన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణను UK లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపుతో సత్కరించింది. భారతీయ సినిమాలో మొదటి నటుడుగా బాలకృష్ణ అందుకున్న ఈ గుర్తింపుకు నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ.. ‘భారతీయ సినిమాను ప్రశంసించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అంకితభావంతో 50 సంవత్సరాలకు పైగా ప్రధాన హీరోగా విశేష కృషిని అందించారు. మీరు సాధించిన ఈ విజయం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది’ అంటూ తెలిపారు. లింక్
Next Story






