Bakasura Restaurant: ఐదు యువ ఆత్మలు ఒక చీకటి శక్తి.. ఓటీటీలోకి రీసెంట్ హిట్ మూవీ

by Chukka Sudharani |

కమెడియన్‌‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘బకాసుర రెస్టారెంట్‌’.

Bakasura Restaurant: ఐదు యువ ఆత్మలు ఒక చీకటి శక్తి.. ఓటీటీలోకి రీసెంట్ హిట్ మూవీ
X

దిశ, సినిమా: కమెడియన్‌‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘బకాసుర రెస్టారెంట్‌’. ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటించగా.. కృష్ణభగవాన్‌, షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌ తదితరలు ముఖ్య పాత్రలో కనిపించారు. ఆగస్టు 8న ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజైంది. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ‘బకాసుర రెస్టారెంట్’ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్‌నెక్ట్స్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 12 నుంచి తెలుగుతో పాటు త‌మిళం భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుపుతూ ‘ఐదు యువ ఆత్మలు.. ఒక చీకటి శక్తి.. బకాసుర రెస్టారెంట్ పీడకల సెప్టెంబర్ 12 నుంచి సన్ నెక్ట్స్‌లో ప్రారంభమవుతుంది’ అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంతో ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అలాగే ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మించారు. లింక్



Next Story