- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బకాసుర రెస్టారెంట్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
కమెడియన్ ప్రవీణ్(Praveen) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’(Bakasura Restaurant).

దిశ, వెబ్‌డెస్క్: కమెడియన్ ప్రవీణ్(Praveen) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’(Bakasura Restaurant). ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు వికాస్ బడిస సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ఆగస్టు 8న ఈ మూవీ థియేటర్లలో రాబోతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. Link






