- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shruti Haasan: శృతి హాసన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అలాంటి పోస్ట్ వైరల్ కావడంతో అంతా షాక్!
యంగ్ బ్యూటీ శృతి హాసన్(Shruti Haasan) కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan)కూతురిగా ఇండస్ట్రీకి వచ్చింది. పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శృతి హాసన్(Shruti Haasan) కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan)కూతురిగా ఇండస్ట్రీకి వచ్చింది. పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. తెలుగు, తమిళ చిత్రాల్లో మెరిసిన ఈ భామ తన అందం, నటనతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపును తెచ్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అలాగే సింగర్‌గానూ పలు సాంగ్స్ పాడుతూ అందరినీ తన గొంతుతో ఫిదా అయ్యేలా చేస్తుంది. అయితే ఈ అమ్మడు ఓ మ్యూజిక్ కన్సర్ట్‌కు హాజరు కాబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగబోతున్న ఈ ఈవెంట్‌కు ఆమె ప్రత్యేక ఆకర్శణగా నిలువబోతున్నట్లు టాక్. దీంతో అంతా టికెట్లు కొనుగోలు చేసుకుని ఆమెను చూసేందుకు వెళ్లడానికి రెడీ అయ్యారు. అయితే ఈ వేడుక ఈ రోజు జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆర్గనైజింగ్ సంస్థ అభిమానులకు బిగ్ షాకిచ్చింది.
ఈ సంగీత కచేరీని వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ‘‘సాంకేతిక కారణాలతో శృతి హాసన్ రావాల్సిన లైవ్ కాన్సర్ట్‌ను ఏప్రిల్ 26కు వాయిదా వేస్తున్నాము. అయితే ఇది వరకే టికెట్స్ కొనుగోలు చేసుకున్న వారికి అదనపు ఖర్చు లేకుండా ప్రవేశం కల్పిస్తాము. ఎవరైనా ఈవెంట్‌కు టికెట్ రద్దు చేసుకోవాలనుకుంటే డబ్బులు కూడా రిఫండ్ ఇస్తాము’’ అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన శృతి హాసన్ అభిమానులు షాక్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ భామ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న ‘కూలీ’(Coolie) మూవీలో కీలక పాత్రలో నటించనుంది. అలాగే దళపతి విజయ్ (vijay) చివరి చిత్రంగా రాబోతున్న ‘జన నాయగన్’ (Jana Nayagan)లోనూ నటిస్తోంది. ఇక ‘ది ఐ’ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలు ఈ ఏడాది చివరలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.






