- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఇకపై వాటికి దూరంగా ఉంటానంటూ హీరో అజిత్ షాకింగ్ డెసిషన్.. (వీడియో)
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మనందరికీ సుపరిచితమే. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మనందరికీ సుపరిచితమే. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అలాగే తెలుగులోనూ మంచి మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏజ్‌లో కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అజిత్ ‘విదాముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాలతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో అజిత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం అజిత్ 24H దుబాయ్ 2025 కార్ రేసింగ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న అజిత్.. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ తర్వాత స్టార్ రేసింగ్ ట్రాక్‌లోకి తిరిగి వస్తున్నాడు. ఇక ఇప్పటికే స్టార్ కార్ రేసింగ్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కార్ రేసింగ్ ట్రైనింగ్‌లో అజిత్ కారు ప్రమాదానికి గురవ్వగా ఈ ఘటనలో హీరోకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజిత్‌ను ఈ పోటీల క్వాలిఫైయింగ్ సెషన్‌లో కెరీర్‌ని, నటనను, రేసింగ్‌ని ఎలా తీసుకెళ్తారు అని అడుగగా.. దానికి ఆయన స్పందిస్తూ.. ‘రేసింగ్ సీజన్ మొదలయ్యే వరకు ఎలాంటి సినిమా కాంట్రాక్ట్‌పై సంతకం చేయను. కేవలం అక్టోబర్ నుంచి మార్చి వరకు నటించాలనేది మాత్రమే నా ప్లాన్. ఇప్పుడు నేను డ్రైవర్‌గానే కాకుండా టీమ్ ఓనర్‌గా కూడా మోటర్‌స్పోర్ట్స్‌లో నిమగ్నమవ్వాలని నిర్ణయించుకున్నాను. అందుకే రేసింగ్ సీజన్ మొదలయ్యే వరకు సినిమాలపై సంతకం చేయను. అంటే రేసింగ్ ముందు వరకు మాత్రమే నేను సినిమాలు చేస్తాను. అలాగే నా సినిమాలు, యాక్టింగ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని హీరో అజిత్ చెప్పుకొచ్చారు . ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






