- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ సినిమా వాయిదా.. !
బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt)-రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి ఓ కూతురు కూడా ఉంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt)-రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి జంటగా నటించిన ‘బ్రహ్మస్త్ర’(Brahmastra) బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రస్తుతం ఆలియా, రణ్‌బీర్ కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’(Love and War). సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఃలవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 20న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు ప్రకటన విడుదలైంది.తాజాగా, ‘లవ్ అండ్ వార్’ చిత్రం వాయిదా పడినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ నవంబర్‌లో మొదలుపెట్టే ప్లాన్‌లో మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ పూట్ పూర్తి అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అయ్యేలా ఉన్నట్లు టాక్. కాబట్టి మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు నిరాశ చెందుతూ కొత్త రిలీజ్ తేదీ ప్రకటించాలని కోరుతున్నారు.






