- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాడ్ గాళ్స్.. వచ్చేస్తున్నారు!!
ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి. ఆయన దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ

దిశ, సినిమా : ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి. ఆయన దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. కాగా క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్.. ‘మా ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. ‘జాతి రత్నాలు’, ‘మ్యాడ్’ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం. ఇది మంచి ఎంటర్టైనర్ చిత్రం. అనూప్ రూబెన్స్ మంచి సంగీతం అందించగా.. ఆస్కార్ చంద్ర బోస్ అన్ని పాటలకు లిరిక్స్ అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయి. ఇటీవల విడుదలైన 'ఇలా చూసుకుంటానే' పాటకు మంచి ఆదరణ లభించింది, యూట్యూబ్‌లో 6 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. అలాగే ఇటీవల విడుదలైన ‘బాడ్ గాళ్స్’ టైటిల్ సాంగ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. మిగతా పాటలు, టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. తప్పక చూడండి’ అని తెలిపారు.






