- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగ శౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అప్డేట్ ఇదే..
తెలుగు సినీ ప్రేక్షకులకు వినోదం, యాక్షన్, మ్యూజిక్ హంగామా అన్నీ ఒకేసారి అందించబోయే క్రేజీ ప్రాజెక్ట్ బ్యాడ్ బాయ్ కార్తిక్ షూటింగ్ పూర్తయింది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ప్రేక్షకులకు వినోదం, యాక్షన్, మ్యూజిక్ హంగామా అన్నీ ఒకేసారి అందించబోయే క్రేజీ ప్రాజెక్ట్ బ్యాడ్ బాయ్ కార్తిక్ షూటింగ్ పూర్తయింది. యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్టు నిర్మాణ సంస్థ శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించింది. "Shoot Wrapped, Gearing up for the blast!" అంటూ తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న సందేశంతో సినిమా నిర్మాణం చివరి దశకు చేరినట్టు తెలిపింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీ వెల్లడించనున్నట్టు కూడా చెప్పింది.
ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా విద్యి నటిస్తోంది. సముద్రఖని "వరధ రెడ్డి" అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపీ, శ్రీదేవి విజయ్ కుమార్ వంటి పలువురు నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా మొదటి లుక్‌కి మంచి స్పందన లభించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు టెక్నికల్ టీమ్ కూడా హై క్వాలిటీగా ఉండటం విశేషం. సినిమాటోగ్రఫీని రసూల్ ఎల్లోర్ చేతిలో ఉండగా, సంగీత దర్శకుడిగా హారిస్ జయరాజ్ తిరిగి తెలుగు ప్రేక్షకులను మైమరిపించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన సంగీతంతో పాటు ఈ సినిమాలో డ్యాన్సుల కొరియోగ్రఫీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రామ్‌చరణ్ డ్యాన్సులకి గుర్తింపు తెచ్చిన రాజు సుందరం, శోబి మాస్టర్, విజయ్ పొలంకి, శిరీష్ వంటి ప్రముఖులు పాటలకు నృత్యాలు అందిస్తున్నారు. పాటల రచనలో చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్ వంటి టాప్ లిరిక్స్ రైటర్లు పని చేస్తున్నారు.
మొత్తానికి బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా షూటింగ్ ముగియడంతో, థియేటర్లలో ఈ మూవీ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ ప్రకటిస్తే చాలు, ప్రమోషన్ సందడి మొదలయ్యేలా ఉంది. ఇది నాగశౌర్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.






