- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’
నాగశౌర్య హీరోగా రూపొందిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. విడుదల అనంతరం కూడా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రం భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకోగా, ఈరోజు నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. మరి థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో విధి యాదవ్ హీరోయిన్‌గా నటించగా, సముద్రఖని కీలక పాత్రలో కనిపించాడు. రమేష్ దేశినా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి, విజయ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.






