- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తోబుట్టువుల ప్రేమకు సాక్షం ‘పొమ్మంటే’
హీరో నాగ శౌర్య యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’తో అలరించబోతున్నాడు. నూతన దర్శకుడు రామ్ దేశినా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించాడు. ఇప్పటి వరకు విడుదలైన

దిశ, సినిమా : హీరో నాగ శౌర్య యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి, టీజర్ కూడా అద్భుతమైన స్పందన అందుకుంది. ఈరోజు, సినిమాలోని పొమ్మంటే అనే ఎమోషనల్ పాటను విడుదల చేశారు.
హారిస్ జయరాజ్ స్వరపరిచిన పొమ్మంటే, మెలోడీ, ఎమోషన్ ఆకట్టుకుంది. విడిపోవడం వల్ల కలిగే బాధను, తోబుట్టువుల అనుబంధాన్ని అందంగా ప్రజెంట్ చేసింది. రచయిత చంద్రబోస్ మనసుకి హత్తుకునే సాహిత్యం రాశారు, గాయకులు విజయ్ యేసుదాస్, శక్తిశ్రీ గోపాలన్ తమ వోకల్స్ తో మరింత హార్ట్ టచ్చింగ్ గా మలిచారు. ఈ పాట చాలా కాలం పాటు నిలిచిపోతుంది.
విజువల్ గా ఈ పాటలో నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ మిస్ అండర్ స్టాండింగ్ ద్వారా విడిపోయిన బ్రదర్, సిస్టర్స్ గా కనిపించారు. వారి అద్భుతమైన పెర్ఫామెన్స్, అజయ్ ప్రజెన్స్ ట్రాక్ ఎమోషన్ ని మరింత పెంచింది. ఇది తోబుట్టువుల ప్రేమకు మనసుని కదిలించే సాంగ్. రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్ డైరెక్షన్ రామాంజనేయులు నిర్వహిస్తున్నారు.






