- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మజాకా’ నుంచి బ్యాచిలర్స్ స్పెషల్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న వీడియో
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన ‘మజాకా’(Majaka) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సందీప్ సరసన రీతు వర్మ(reethu Varma) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సీనియర్ యాక్టర్ రావు రమేష్(rao Ramesh), అలనాటి హీరోయిన్ అన్షు(Anshu) కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రవితేజ ‘ధమాకా’ మేకర్ త్రినాధరావు నక్కిన(Trinadha Rao Nakkina) దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ చిత్రాన్ని ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా(Rajesh Danda), ఉమేష్ కె ఆర్ బన్సాల్(Umesh KR Bansal) నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా(Balaji Gutha) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో వస్తున్న ఈ మూవీనుంచి ఇప్పటికే విడుదలైన టీజర్(Teaser) ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. తాజాగా ఈ సినిమా నుండి ‘బ్యాచ్‌లర్స్ యాంథమ్’(Bachelor's Anthem) లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పాట.. బ్యాచిలర్స్‌కి పర్ఫెక్ట్ సింక్ అయ్యేలా ఉందని చెప్పాలి.
యిన్‌గా రామ జోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యం బ్యాచిలర్స్ మనసులోని మాటల్నే పాటగా కూర్చినట్టు ఉంది. దీనితో పాటుగా తన తండ్రిపై నడిచే సాహిత్యం కూడా బాగుంది. ఇక ఈ సాంగ్‌కి లియోన్ జేమ్స్ ఇచ్చిన ట్యూన్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ కాగా ఈ పాటలో సందీప్ కిషన్, రావు రమేష్‌లు అదరగొట్టారని చెప్పాలి. వైజాగ్‌లో చూపించిన దృశ్యాలు బాగున్నాయి. మొత్తానికి అయితే ఫస్ట్ సింగిల్‌గా మంచి సాంగ్‌ని మేకర్స్ వదిలారు. కాగా ఈ మూవీ ఈ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది.






