- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ డ్రెస్సులో బేబమ్మ.. ఎలా ఇంత అందంగా ఉన్నావంటూ కామెంట్స్
‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కృతి శెట్టి(Krithi Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ సినిమాతోనే బేబమ్మగా తెలుగు ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. దీంతో ఈ క్యూట్ హీరోయిన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా చాలా సినిమాల్లో నటించినా ఉప్పెన లాంటి హిట్ అయితే రాలేదు. దీంతో కొన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ప్రజెంట్ ప్రదీప్ రంగనాథ్(Pradeep Ranganath) హీరోగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీలో నటిస్తున్నది ఈ చిన్నది.
ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం స్టైలిష్ వేర్ డ్రెస్సులతో కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతి శెట్టి తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్సుకు చున్నీకప్పుకొని చాలా సంప్రదాయకంగా కనిపించింది. మినిమల్ మేకప్‌తో చాలా అందంగా ఉంది. ఇక హెయిర్ లీవ్ చేసుకుని కొన్ని డిఫరెంట్ స్టిల్స్‌తో పిక్స్ దిగింది.
ఇక వాటికి.. ‘సంక్రాంతి శుభాకాంక్షలు.. పొంగలో పొంగల్ ఈ సమయం మరింత ప్రత్యేకమైనది ఎందుకంటే వా వాతియార్ మూవీ మీ దగ్గర్లోని థియేటర్లలో ఉంది.. దయచేసి మీ కుటుంబంతో వెళ్లి ఆనందించండి’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఎలా ఇంత అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
వివాదంలో చిక్కుకున్న సాయిపల్లవి సినిమా .. అదృష్టం కలిసొచ్చేనా?






