Rana Daggubati: షాకింగ్ ట్విస్ట్‌లతో వచ్చేస్తున్న ‘బాపు’ మూవీ.. ఫస్ట్ లుక్‌తో క్యూరియాసిటీ పెంచిన రానా

by Mallepaka Hamsa |

స్టార్ హీరోయిన్ ఆమని(Amani), బ్రహ్మాజీ(Brahmaji), ధన్య, కేతిరి సూధాకర్ రెడ్డి(Kethiri Sudhakar Reddy) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాపు’(Baapu).

Rana Daggubati: షాకింగ్ ట్విస్ట్‌లతో వచ్చేస్తున్న ‘బాపు’ మూవీ.. ఫస్ట్ లుక్‌తో క్యూరియాసిటీ పెంచిన రానా
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ ఆమని(Amani), బ్రహ్మాజీ(Brahmaji), ధన్య, కేతిరి సూధాకర్ రెడ్డి(Kethiri Sudhakar Reddy) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాపు’(Baapu). ఈ సినిమాకు రాజు దయ దర్శకత్వం వహిస్తుండా.. కామ్రెడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అతిరా ప్రొడక్షన్స్(Athiraa Productions) బ్యానర్స్‌పై వంశీ శేఖర్, భాను ప్రసాద్(Bhanu Prasad), ద్రువాన్, అలయం అనిల్, శ్యామ్, శ్రీపాల్, వైవా రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్(First Look) పోస్టర్‌ను రానా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

‘‘ఇందులో హాస్యం, షాకింగ్ ట్విస్ట్‌లు ఉంటాయి. ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం మిమ్మల్ని అలరించడంతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఈ పోస్టర్‌లో సుధాకర్ మద్యం, నాన్ వెజ్ ముందు పెట్టుకుని కూర్చుని ఉండగా.. అతని వైపు ఆమని బ్రహ్మాజీ ఫ్యామిలీ మొత్తం చూస్తుంటారు. అయితే ఇది ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్న కథగా రాబోతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రానుంది. ప్రస్తుతం ‘బాపు’ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story