- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాహుబలి రీ-రిలీజ్...రన్ టైం 4 గంటలా...!
ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి (Bahubali ) గ్రాండ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి, బాహుబలి 2 రెండు

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి (Bahubali ) గ్రాండ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి, బాహుబలి 2 రెండు పార్టులు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ సినిమాలను జక్కన్న చాలా జాగ్రత్తగా తెరపైకి ఎక్కించారు. ఇక ప్రభాస్ హీరోగా చేసిన.. బాహుబలి సిరీస్ లో... రానా, రమ్యకృష్ణ, అనుష్క ఇలా చాలా మంది తోపు నటీనటులు మెరిసి సక్సెస్ అందుకున్నారు.
కోట్ల వర్షం కొల్లగొట్టిన ఈ సినిమా... ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టులను కలిపి బాహుబలి సిరీస్ ను రీ రిలీజ్ చేయబోతోంది చిత్ర బృందం. ఈ అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం అలాగే హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. రెండు పార్టులు కలిపి రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ మూవీ రన్ టైం 3 గంటల 50 నిమిషాలకు చేరింది. అంటే ఈ సినిమాకి వెళ్లిన వాళ్లు 3:50 గంటలపాటు థియేటర్లోనే కూర్చోవాలి. అయితే రన్ టైం పైన ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే క్లారిటీ రానుంది.






