‘బాహుబలి వస్తున్నాడు’.. రీరిలీజ్ డేట్ ఫిక్స్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-10 10:18:58  IST  )

తెలుగు సినిమా చరిత్రను మార్చిన మహా చిత్రం ‘బాహుబలి’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘బాహుబలి వస్తున్నాడు’.. రీరిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్:తెలుగు సినిమా చరిత్రను మార్చిన మహా చిత్రం ‘బాహుబలి’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదలై నేటికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దాన్ని మళ్లీ విడుదల చేయనున్నట్లు సినిమా దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రకటించారు.

ఈ మేరకు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టును పంచుకున్నారు. 'పదేళ్లు గడిచినా.. ‘బాహుబలి’ మాయ మాత్రం మిగిలే ఉంది. రెండు భాగాలుగా అలరించిన బాహుబలి ఇప్పుడు ఒకే పార్ట్‌గా మీ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ‘బాహుబలి: ది ఎపిక్‌ (Baahubali The Epic) పేరుతో ఇది రిలీజ్‌ కానుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకురానుంది' అని ఆయన పేర్కొన్నారు.

ఇక పాన్‌ ఇండియా స్థాయిలో సంచలనం రేపిన ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో చూడగలగడం అభిమానులకు మరోసారి సందడిని తీసుకురానుంది. అలాగే ప్రస్తుతం ‘#బాహుబలివస్తున్నాడు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

Next Story