- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అవ్వల్ దావత్’.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రాహుల్ సిప్లిగంజ్ సాంగ్..
అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. యూత్ ఫుల్ కామెడీతో రాబోతున్న సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటిస్తున్నారు.

దిశ, సినిమా : అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. యూత్ ఫుల్ కామెడీతో రాబోతున్న సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటిస్తుండగా.. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మాధవి రెడ్డి సోమ నిర్మాతగా, మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ అయిన ‘అమీర్ లోగ్’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే వైరల్ కాగా .. తాజాగా రిలీజ్ చేసిన మాస్ సాంగ్ ‘అవ్వల్ దావత్’ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. యూట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్‌కు పైగా వీక్షణలతో దూసుకుపోతోంది. రాహుల్ సిప్లిగంజ్ గాత్రం, ఆనీ మాస్టర్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రానికి ఎస్‌వికె సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.






