- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యంగ్ హీరోయిన్ పెళ్లిలో ట్విస్ట్.. చివరి క్షణంలో తాళిబొట్టు మిస్.. టెన్షన్.. టెన్షన్..(వీడియో)
‘పతి పత్నీ ఔర్ పంగా’ రియాలిటీ షో హ్యూజ్ సక్సెస్ అయింది. హిందీ టెలివిజన్ సీరియల్ తారలు తమ పార్టనర్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. తమ వివాహ జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. బంధంలో బలం, బలహీనతల గురించి చర్చించారు

దిశ, వెబ్ డెస్క్ : ‘పతి పత్నీ ఔర్ పంగా’ రియాలిటీ షో హ్యూజ్ సక్సెస్ అయింది. హిందీ టెలివిజన్ సీరియల్ తారలు తమ పార్టనర్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. తమ వివాహ జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. బంధంలో బలం, బలహీనతల గురించి చర్చించారు. అయితే ఈ కార్యక్రమాన్నే వివాహ వేదికగా మార్చుకుంది యంగ్ హీరోయిన్ అవికా గోర్. తన బాయ్ ఫ్రెండ్ మిలింద్ చద్వానీతో కలిసి పెళ్లి పీటలు ఎక్కింది.
అయితే ఈ వివాహం కూడా స్క్రిప్టెడ్‌గా జరిగిందనే విమర్శలు వచ్చాయి. కారణం పెళ్లిలో సినిమాటిక్ ట్విస్ట్ చోటు చేసుకోవడమే. అవును.. హిందూ సంప్రదాయం జరిగిన పెళ్లిలో చివరి క్షణంలో తాళిబొట్టు మిస్ కావడంతో.. అవికా కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. మంగళసూత్రం ఎక్కడా అంటూ మిలింద్‌ను అడగడం, టెన్షన్ పడడం ఇందులో కనిపిస్తుంది. కానీ దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఇది కూడా డ్రామానే అయితే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బంధువుల మధ్య గొప్పగా జరుపుకోవాల్సిన పెళ్లిని.. రియాలిటీషోగా మార్చడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.






