Avika Gor: నాకు ఇంటి నుంచి సపోర్ట్ లేదు.. అయినా హీరోయిన్‌గా ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది.. అవికా గోర్ కామెంట్స్

by Chukka Sudharani |

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అవికా గోర్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Avika Gor: నాకు ఇంటి నుంచి సపోర్ట్ లేదు.. అయినా హీరోయిన్‌గా ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది.. అవికా గోర్ కామెంట్స్
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అవికా గోర్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది ‘షణ్ముఖ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చన ఈ అమ్మడు.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలు పంచుకుంది. ‘‘చిన్నారి పెళ్లి కూతురు’గా స్టార్ట్ అయినా నా ప్రయాణం ఈస్థాయికి చేరడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ స్థాయిని ఇచ్చిన ప్రతీ ప్రేక్షకుడికి నా కృతజ్ఞతలు. ఎటువంటి అధికారిక శిక్షణ, బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నన్ను ఎంతో ఆదరించారు. కనీసం నా ఫ్యామిలీ నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. అయినా ఈ రోజు ఈ ప్లేస్‌లో నేను ఉన్నాను. దీనికి ఎంతో సంతోషంగా ఉంది. మంచి పాత్రలు వచ్చినప్పుడు బాధ్యతగా నటించి విజయం అందుకునేలా చేయడం ఆర్టిస్టుగా నా బాధ్యత. ఓటీటీ లేదా టెలివిజన్ లేదా సినిమా ఏదైనా సరే నేను ఒకే విధంగా పని చేస్తాను. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని ఒడిదుడుకులను అధిగమించి అనుకున్న స్థాయికి చేరతా’ అని తెలిపింది.

Next Story