- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్మృతి పెళ్లిపై హీరోయిన్ సంచలన పోస్ట్
క్రికెటర్ స్మృతి మందనా, పాలష్ ముచ్చల్ పెళ్లి ఆగిపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనిపై భారీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొందరు స్మృతి తండ్రి అనారోగ్యమే ఇందుకు కారణం అంటుంటే ఇంకొందరు మాత్రం పాలష్ చీటింగ్ చేశాడని అంటున్నారు.

దిశ, సినిమా : క్రికెటర్ స్మృతి మందనా, పాలష్ ముచ్చల్ పెళ్లి ఆగిపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనిపై భారీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొందరు స్మృతి తండ్రి అనారోగ్యమే ఇందుకు కారణం అంటుంటే ఇంకొందరు మాత్రం పాలష్ చీటింగ్ చేశాడని అంటున్నారు. ఓ లేడీ కొరియోగ్రాఫర్‌తో దొరికిపోవడంతో పెళ్లి ఆగిపోయిందంటున్నారు. దీనిపై ఇరు కుటుంబాలు క్లారిటీ ఇవ్వకపోవడంతో.. ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ అవికా గోర్ స్పందించింది. ‘ఒకరి బాధ మన స్టోరీ లైన్ కాకూడదు. వాళ్లకు స్పేస్ ఇవ్వండి.. రెస్పెక్ట్ ఇవ్వండి.. కచ్చితంగా వాళ్లు నెగెటివిటీకి అర్హులు కారు. ప్లీజ్ స్టాప్ ఎవ్రీ వన్’ అంటూ రిక్వెస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై కొందరు పాజిటివ్‌గా స్పందించినా.. ఇంకొందరు మాత్రం తప్పు చేసిన వ్యక్తులను తప్పు చేశారని చెప్పడమే తప్పు అయిపోయిందా అంటూ రిప్లయ్ ఇస్తున్నారు.






