రిలీజ్‌కు ముందే బెంచ్ మార్క్‌ను చేరుకున్న అవతార్: ఫైర్ అండ్ యాష్

by Chukka Sudharani |

రిలీజ్‌కు ముందే బెంచ్ మార్క్‌ను చేరుకున్న అవతార్: ఫైర్ అండ్ యాష్
X

దిశ, సినిమా: సినిమా అభిమానులను ఏకకాలంలో మైమరపించిన జేమ్స్ క్యామెరన్‌ ‘అవతార్’ సిరీస్‌ మరోసారి భారీ హంగామా సృష్టించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్న మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’(Avatar: Fire and Ash) కి భారత మార్కెట్‌లో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది. రీసెంట్‌గా బుక్‌మైషో విడుదల చేసిన డేటా ప్రకారం, 12 లక్షలకుపైగా ఇండియన్ లవర్స్ ఈ సినిమాపై తమ ఆసక్తిని చూపారు. అడ్వాన్స్‌ ఇంటరెస్ట్‌లో ఇంత భారీ నెంబర్లు సాధించడం పెద్ద సినిమాలకే సాధ్యం కాగా.. ఇప్పుడు అవతార్ కూడా బెంచ్‌మార్క్ సృష్టించింది. మొదటి రెండు భాగాల్లో చూసిన భావోద్వేగం, విజువల్స్‌ ఈసారి కూడా మరింతగా ఉండబోతున్నాయన్న అంచనాలు ప్రేక్షకుల్లో విపరీతంగా ఉన్నాయి. జేక్ సల్లి (సామ్ వర్తింగ్టన్), నెయ్టిరి (జోయ్ సాల్దానా) మళ్లీ పాండోరా ప్రపంచంలోకి తీసుకెళ్లబోతుండగా, ఈసారి కథలో కీలకంగా నిలిచేది కొత్త తెగ “అష్ పీపుల్”. వారి నాయకురాలిగా ఊనా చాప్లిన్ కనిపించబోతున్నారు. ఆమె పాత్ర వరాంగ్‌పై హాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా హైప్ పెరిగింది. కాగా.. ఈ చిత్రం ఆరు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

Next Story