- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Avatar-3: ‘అవతార్-3’ సరికొత్త పోస్టర్..
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో అందరినీ కట్టిపడేశారు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కూడా వచ్చింది. రెండు భాగాలకు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ మేకర్స్ ‘అవతార్-3’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘అవతార్-ఫైర్ అండ్ యాష్’ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ట్రైలర్ తప్పా మరో అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఓ సరికొత్త పోస్టర్‌ను షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నది. లింక్






