- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nani: మంచి సినిమాలు చేస్తేనే ఆడియన్స్ చూస్తారు.. డైరెక్టర్‌కు నాని స్ట్రాంగ్ కౌంటర్? (వీడియో)
గత కొద్ది రోజుల నుంచి ఓటీటీలోనే జనాలు సినిమాలు చూస్తూ థియేటర్స్‌కు పోవడం మానేశారు.

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఓటీటీలోనే జనాలు సినిమాలు చూస్తూ థియేటర్స్‌కు పోవడం మానేశారు. దీంతో ఎంత పెద్ద స్టార్ హీరో చిత్రం అయినప్పటికీ విడుదలైన రోజే ఆన్‌లోకి హెచ్‌డీ ప్రింట్ వచ్చేస్తున్నాయి. దీంతో ఎంచక్కా కొత్త సినిమాలు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో నిర్మాతలు నష్టాల పాలవుతున్నారు. ఇక ఈ విషయంపై ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసలు జనాలు థియేటర్స్‌లోకి రావడం లేదు.. స్టార్ హీరోల సినిమాలు అయినా చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. ఇంకా కొత్త నటీనటులను పెట్టి చేయాలంటే భయమేస్తుంది. అసలు పరిస్థితి అస్సలు బాలేదు అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇదే విషయంపై నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో త్రినాథరావు నక్కిన(Trinadha Rao Nakkina)కు కౌంటర్ ఇచ్చాడని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. నాని (nani)ఏమన్నారంటే.. ‘‘చాలా కారణాలు ఉన్నాయి.
నేను ఏం చేస్తే చూస్తారు అని ఎక్కువగా ఆలోచిస్తుంటాను. నా మనసుకి నచ్చింది చేస్తాను కాబట్టి సక్సెస్ అయ్యాను. ఒక సినిమాను నేను ఒక్కడిని తీసేది కాదు. మంచి ప్రాజెక్ట్స్ తెరకెక్కించడానికి చాలామంది కావాలి. అయితే హిట్-3 ట్రైలర్ చూసినప్పుడు వైలెన్స్ కనిపించదు కానీ.. సినిమా మొత్తం చూసేటప్పుడు పర్‌పస్ అర్థం అవుతుంది. షూట్ షాట్ అయ్యాక నేను కాంప్లికేటెడ్ అనుకున్న పనిని అర్జున్ సర్కార్ పూర్తి చేస్తాడు. అసలు సైంధవ్ చేసిన శైలేష్ కొలను వేరు హిట్ తీసింది వేరు. అయితే ఆడియెన్స్ సినిమాలు చూడటం లేదు అని ఎవరన్నా అంటే నాకు కోపం వస్తుంది. మంచి కంటెంట్ ఇస్తే చూస్తారు. అసలు మనం ఎప్పుడైనా కోట్లు వచ్చిన సినిమాలు చూశామా చిన్న చిత్రాలుకూడా హిట్‌గా నిలుస్తున్నాయి.
అసలు మూవీ బాగుంటే ఎవరూ ఇంట్లో కూర్చోరు. కాబట్టి ముందు మనం మంచి కంటెంట్ ఇస్తే చూసేందుకు ఎంతోమంది రెడీగా ఉన్నారు. ‘కోర్టు’ మూవీ రూ. 60 కోట్లు రాబట్టడం చిన్న విషయం కాదు. అందరూ సినిమా లవర్స్ అలా అనకూడదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, నాని ‘హిట్-3’(Hit-3) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శైలేష్ కొలను(Sailesh Kolanu ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే1న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.






