- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి సినిమాలు ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు… నాకు కూడా చేయాలని ఉంది: ఆకాష్ పూరి
రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య(Srinivas Subrahmanya) నిర్మాణంలో రాకీ షెర్మన్(Rocky Sherman) తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’.

దిశ, సినిమా: రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య(Srinivas Subrahmanya) నిర్మాణంలో రాకీ షెర్మన్(Rocky Sherman) తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అర్చన, మితాలి చౌహాన్(Mithali Chauhan), వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేష్(Naga Mahesh), దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు.
ఆకాష్ పూరి(Akash Puri) మాట్లాడుతూ.. ‘‘ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ‘కర్మ స్థలం’ అనే టైటిల్, మోషన్ పోస్టర్ కూడా బాగుంది. చెప్పాలంటే నేను కూడా అమ్మవారి భక్తుడిని. ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం సూపర్ ఎక్ససైటింగ్‌గా ఉంది. ఈ మధ్య హనుమాన్(Hanuman), కార్తికేయ(Kartikeya), కాంతారా ఇలాంటి సినిమాలని ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్‌తో ముందుకి తీసుకెళ్తారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారు. నేను కర్మను నమ్ముతాను. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అలానే చెడు చేస్తే చేడు జరుగుతుంది అని నమ్ముతాను. ఇలాంటి కథ చేయాలని నాకు ఉంది’’ అని చెప్పుకొచ్చారు.
Read Also..
Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘NKR-21’ సినిమాకు అదిరిపోయే టైటిల్.. హైప్ పెంచుతున్న పోస్టర్






