- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆత్రేయపురం బ్రదర్స్’.. టైటిల్‌తోనే సక్సెస్ కొట్టేశారు..
ట్రెండ్ మారింది.. ఆడియన్స్ ఆలోచనలు మారిపోయాయి. వారి అంచనాలకు అనుగుణంగా వైవిద్యభరితమైన స్టోరీతో వస్తున్న చిత్రం ‘ఆత్రేయపురం బ్రదర్స్’.

దిశ, సినిమా : ట్రెండ్ మారింది.. ఆడియన్స్ ఆలోచనలు మారిపోయాయి. వారి అంచనాలకు అనుగుణంగా వైవిద్యభరితమైన స్టోరీతో వస్తున్న చిత్రం ‘ఆత్రేయపురం బ్రదర్స్’. రాజేష్ జగన్నాధం ఈ చిత్రానికి దర్శకులు కాగా S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె నిర్మాతలు. కాగా రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా డైరెక్టర్ వశిష్ట, డైరెక్టర్ అనుదీప్, డైరెక్టర్ ఆదిత్య హాసన్, డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల హాజరయ్యారు. ఈ సందర్భంగా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఏ స్వీట్ రైవల్రీ అనే ట్యాగ్ లైన్‌తో ఇద్దరు వ్యక్తులు బల పరీక్ష చేసుకుంటున్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు మేకర్స్.






