- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసుర సంహారం
లెజెండరీ యాక్టర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దిశ, సినిమా : లెజెండరీ యాక్టర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీకృష్ణ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్, సాంగ్ లాంచింగ్ కార్యక్రమం తనికెళ్ల భరణి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన విలేజ్ క్రైమ్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన తనికెళ్ల భరణి..‘‘అసుర సంహారం’ అంటే చెడుపై మంచి సాధించిన విజయం. డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ మంచి సబ్జెక్టను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాలో ఒక విలేజ్‌లో డిటెక్టివ్ పాత్ర పోషించాను. ఈ సినిమా నిర్మించడంలో, షూటింగ్ పార్టులో NRI శబరిష్, మిధున ప్రియ మాకు బాగా సహకరించారు’ అని తెలిపారు.






