‘ఇది తాగుతూ వేసవిలో మునిగి తేలుతున్నాను’.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

by Kodari Anjali |   (  Updated:2025-03-17 14:11:05  IST  )

ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘ఇది తాగుతూ వేసవిలో మునిగి తేలుతున్నాను’.. హీరోయిన్ పోస్ట్ వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటి కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన నటన రూపం చూపించింది. తర్వాత తమిళ సినిమాల్లో నటించింది. క్రేజీ బాయ్ అనే కన్నడ మూవీలో అద్భుతంగా నటించి మెప్పించిన ఆషికా రంగనాథ్‌కు ఉత్తమ నటిగా SIIMA అవార్డు లభించింది. ఇక తర్వాత ఈ భామను దర్శక, నిర్మాతలు వరుసగ రెమో, రాంబో 2, మధగజ వంటి చిత్రాలకు కన్నడ నామినేషన్‌ను కూడా అందుకుంది.

ఇక ఈ అమ్మడే నటించిన క్రేజీ బాయ్‌ చిత్రానికి మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి మహేష్ బాబు (Mahesh Babu) క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు పోటీలో ఈ నటిని సెలక్ట్ చేశారు. ఇక తర్వాత శివ రాజ్‌తో కలిసి మాస్ లీడర్ అండ్ గణేష్‌తో కలిసి ముగులు నాగేలో కూడా అవకాశం దక్కించుకుంది. ఈ మూవీస్ బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా నిలిచి.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి.

ఇక కన్నడలో రాజు కన్నడ మీడియం, థైగే థక్క మాగ , రాంబో 2 లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. తర్వాత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అనంతరం ఈ బ్యూటీ సుదీపతో కోటిగొబ్బ 3లో పటాకి పోరియో సాంగ్‌లో మెరిచింది. అనంతరం శ్రీమురళి (Shri Murali) సరసన మధగజలో అవకాశం దక్కించుకుంది. వీటితో పాటుగా గరుడ, కానేయాదవర బగ్గే ప్రకటనలో కూడా కనిపించింది.

ఇక 2023 లో నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సరసన అమిగోస్ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అలాగే నాగార్జునతో కలిసి నా సామి రంగలో నటించింది. ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కూడా ఆషికా రంగనాథ్ పలు చిత్రాలతో బిజీగా ఉంది.

అయినప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా ఈ నటి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కొబ్బరి బొండ చేతిలో పట్టుకుని.. కొబ్బరి వాటర్ తాగుతూ.. ఫొటోలకు ఫోజులిచ్చింది. వీటికి ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘నీరు తాగుతూ సంతోషంగా, వేసవిలో మునిగి తేలుతున్నాను. నాతో ఎవరు చేరుతున్నారు?’’ అంటూ క్యాప్షన్ జోడించింది.


READ MORE ...

Jinal Joshi: బట్టలు విప్పి ఆ పార్ట్ చూపిస్తూ.. ఈ హీరోయిన్‌ చేసే ఎక్స్‌పోజ్‌‌కు కుర్రాళ్లు తట్టుకోగలరా..?


Next Story