Ashika Ranganath: చీర కట్టులో నాగార్జున బ్యూటీ.. దేవకన్యలా ఉన్నావంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-14 08:17:54  IST  )

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Ashika Ranganath: చీర కట్టులో నాగార్జున బ్యూటీ.. దేవకన్యలా ఉన్నావంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కింగ్ నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామి రంగా’(Na Saami Ranga) చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సరసన ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్ డోస్‌తో అమాంతం కుర్రకారును రెచ్చగొతున్న అషికా తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ ట్రెడిషనల్ ఫొటో షేర్ చేసింది. అందులో పర్పుల్ కలర్ శారీ కట్టుకొని, బుట్టలు, బ్యాంగిల్స్, రింగ్, బొట్టుతో చాలా అందంగా కనిపించింది. అంతే కాకుండా చాలా క్యూట్ స్మైల్‌తో వావ్ అనిపించింది. దీంతో ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ క్యూటీ, బేబీ డాల్, దేవకన్యలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Also Read..

Samantha: పాపిట బొట్టుతో దర్శనమిచ్చిన సమంత.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..

Next Story