- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సినిమా ఈవెంట్.. స్టేజ్‌ను షేక్ చేసిన రవితేజ భామలు
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ జనవరి 13న ఖరారు చేయగా ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ జనవరి 13న ఖరారు చేయగా ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే నేడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కాగా ఈ ఈవెంట్ లో సినిమాలో హీరోయిన్లుగా నటించిన డింపుల్ హయాతి, అశిక రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భామలు సినిమాలోని ఫోక్ సాంగ్‌కు స్టేజిపైకి వెళ్లి స్టెప్పులు వేశారు.
సినిమాలోని వామ్మో వాయ్యో పాటకు హీరోయిన్లు స్టెప్పులు వేయడంతో ఈవెంట్‌లో జోష్ డబుల్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. సినిమాలో సునీల్, వెన్నెల కిషోర్, సత్య ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షలను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.






