- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మియా ఖలీఫాను చంపేసిన నెటిజన్లు.. ఆందోళనలో ఫ్యాన్స్!

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ నటి, మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా చనిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మియా అధికారిక ఫేస్‌బుక్ పేజీ అనుకోకుండా 'రిమెంబరింగ్ మియా ఖలీఫా' పేరుతో మెమోరియల్ ఖాతాగా మారడంతో షాక్‌కు గురైన ఫ్యాన్స్ ఆమె నిజంగానే చనిపోయిందనుకుని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ న్యూస్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన మియా.. ఒక హాలీవుడ్ మూవీ సీన్ పిక్‌తో కూడిన హిలేరియస్ మీమ్‌ను షేర్ చేసింది.
దీన్ని 'మీలో చనిపోయినవారిని బయటకు తీసుకురండి. నేను ఇంకా చనిపోలేదు! బాగానే ఉన్నాను' అనే క్యాప్షన్‌తో పోస్టు చేసింది. ఇక ఈ నోట్‌తో ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్.. తన ఖాతా హ్యాక్ అయి ఉండవచ్చని అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఫేస్‌బుక్‌లో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అనుకోకుండా మార్చబడిందని విశ్వసిస్తున్నారు.
అయితే మియా మరణంపై రూమర్స్ క్రియేట్ కావడం ఇదే మొదటిసారి కాదు. జూన్ 2020లోనూ తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించారు. తర్వాత ఒక్క ట్వీట్‌తో అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేసింది. ఇక అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీని విడిచిపెట్టిన తర్వాత మియా స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2021లో రైతులకు మద్దతుగా ఆమె ట్వీట్ చేసింది.






