- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Arrest: బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం.. అలియా భట్ మాజీ అసిస్టెంట్ అరెస్ట్
బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో సంచలన పరిణామం చోటచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో సంచలన పరిణామం చోటచేసుకుంది. ప్రముఖ నటి అలియా భట్ (Alia Bhatt) మాజీ పర్సనల్ అసిస్టెంట్ వేదికా ప్రకాశ్ శెట్టి (Vedika Prakash Shetty)ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... వేదికా ప్రకాశ్ శెట్టి 2021 నుంచి 2024 వరకు నాలుగేళ్ల పాటు ఆలియా భట్ పీఏగా విధులు నిర్వర్తించింది. ఈ క్రమంలోనే ఆలియా భట్ నిర్మాణ సంస్థ అయిన ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆమె పర్సనల్ గదు లావాదేవీలు, కాల్ షీట్లు, షెడ్యూల్‌ను తనే చూసుకునేంది. అయితే, వేదికా ప్రకాశ్ శెట్టికి ఉన్నట్టుండి దుర్భుద్ధి పుట్టింది. నకిలీ బిల్లులను తయారు చేసి ఏకంగా వాటిపై ఆలియా భట్ సంతకం చేయిస్తూ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తూ ఉండేది.
అనంతరం ఆ మొత్తాన్ని బిల్లుల పేరుతో బంధువులు, స్నేహితుల ఖాతాలకు మళ్లించి తిరిగి తన అకౌంట్‌కు టాన్స్‌ఫర్ చేయించుకునేది. ప్రయాణ ఖర్చులని, సమావేశాలకు అని అలా దాదాపు రూ.76.9 లక్షలు కొట్టేసింది. దీంతో విషయం కాస్త బయటకు రావడంతో అలియా భట్ తల్లి, నటి, దర్శకురాలు సోనీ రజ్దాన్ (Soni Razdan) జనవరి 23న జుహు పోలీసులకు వేదికా ప్రకాశ్ శెట్టిపై ఫిర్యాదు చేసింది. దీంతో వారు కేసు నమోదు చేసుకుని నిందితురాలి కోసం తీవ్రంగా గాలించారు. మొదట రాజస్థాన్, కర్ణాటక, పూణేలో ఆమె ఆచూకీ లభించినప్పటకీ వేదికా ప్రకాశ్ శెట్టి పట్టుకోలేకపోయారు. పక్కా సమాచారంతో ఇవాళ పోలీసులు ఆమెను బెంగళూరులో అరెస్టు చేసి, ముంబైకి ట్రాన్సిట్ రిమాండ్‌పై తీసుకొచ్చారు.






