Kalyan Ram: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ అప్డేట్.. పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-11 11:06:17  IST  )

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) అమిగోస్, డెవిల్ చిత్రాల తర్వాత ఏడాది పాటు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు.

Kalyan Ram: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ అప్డేట్..  పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) అమిగోస్, డెవిల్ చిత్రాల తర్వాత ఏడాది పాటు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఈ క్రమంలో నిర్మాతగా పలు ప్రాజెక్ట్స్ చేశారు.. కానీ హీరోగా నటించలేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun Son Of Vyjayanthi). హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) తెరకెక్కిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై దీనిని అశోక వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. అయితే ఇందులో , సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ యానిమల్ పృథ్వీరాజ్,సోహైల్ ఖాన్, సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanti) కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇప్పటికే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి అప్డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ట్రైలర్ హనుమాన్ జయంతి సందర్భంగా రేపు (ఏప్రిల్ 12) సాయంత్రం 7:59 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే సంకెళ్లతో ఉగ్రరూపంలో ఉన్న కళ్యాణ్ రామ్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘అతను సంకెళ్ళు తెంచుకుని, తను ఇష్టపడే దాని కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story