విజయ్-రష్మికలను ఒక్కటి చేసిన అర్జున్ సర్జా కూతురు.. ఎలానో తెలుసా?

by Pulgam srinivas |

విజయ్ - రష్మిక జంటగా నటించిన మొదటి సినిమా 'గీత గోవిందం'లో ఫస్ట్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య సర్జాను హీరోయిన్గా అనుకోగా, ఆమె మాత్రం ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

విజయ్-రష్మికలను ఒక్కటి చేసిన అర్జున్ సర్జా కూతురు.. ఎలానో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ నటీనటులలో విజయ్ - రష్మిక జోడి ఒకటి. వీరిద్దరూ దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు. ఈనెల పదవ తేదీన మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. చాలా కాలం నుండి వీరి ప్రేమకు సంబంధించి ఎన్నో రూమర్స్ వచ్చినా వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. ఈ జోడీ ఇప్పటివరకు రెండు సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ పై ఉంది. ఈ జంట కలిసి మొదటగా గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.

ఆ తర్వాత ఈ కాంబోలో డియర్ కామ్రేడ్ వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించకపోయినా ఈ జంటకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం రణబాలి అనే చిత్రంలో వీరు కలిసి నటిస్తున్నారు. వీరి ప్రేమ మొదలవ్వడానికి, అది పెళ్లి వరకు దారి తీయడానికి గీత గోవిందం చిత్రం మొట్టమొదటి మెట్టు వేసింది. ఇక విజయ్ - రష్మిక కలవడానికి అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య సర్జా ప్రధాన కారణం అనే విషయం మీకు తెలుసా... అదెలా అనుకుంటున్నారా? గీత గోవిందం సినిమాలో హీరోయిన్గా మొదటగా రష్మికను అనుకోలేదట, చాలామందిని అనుకున్నారట.

అందులో భాగంగా ఒకానొక సమయంలో ఐశ్వర్య అర్జున్ ను కూడా ఇందులో హీరోయిన్గా తీసుకోవాలి అనుకొని ఈ బ్యూటీని సంప్రదించగా ఈమె మాత్రం కొన్ని కారణాలవల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పినట్లు కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఐశ్వర్య అర్జున్ కొన్ని రోజుల క్రితమే సీతా పయనం అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఈ మూవీ పరవాలేదనె అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.

Next Story