Arijit Singh: సింగ‌ర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్‌

by velandi.Saikiran |   (  Updated:2026-01-27 16:29:10  IST  )

సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ఇస్తూ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ప్లే బ్యాక్ సింగింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

Arijit Singh: సింగ‌ర్  అర్జిత్ సింగ్ రిటైర్మెంట్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బాలీవుడ్ సంచలన సింగర్ అర్జిత్ సింగ్ ( Arijit Singh ) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ఇస్తూ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ప్లే బ్యాక్ సింగింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా తన నిర్ణయాన్ని పంచుకున్నాడు. తన కెరీర్ లో ఇప్పటి వరకు తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు అర్జిత్ సింగ్. తన నిర్ణయం చాలా మందిని బాధపెట్టినప్ప‌టికీ, అందరూ అర్థం చేసుకుంటారని వెల్లడించారు. ఇప్పటి వరకు తన కెరీర్ అద్భుతంగా సాగిందని గుర్తు చేసుకున్నారు. ఇకముందు అలాగే కొత్త ప్రయాణం మొదలు పెడతానని వెల్లడించారు.

ఇది ఇలా ఉండగా తుం హీ హో, కేసరియా లాంటి మెలోడీలతో అందరినీ మెప్పించారు. ఈ నేపథ్యంలోనే రెండు నేషనల్ అవార్డులు కూడా దక్కించుకున్నారు. ప్రభుత్వం నుంచి పద్మ శ్రీ గౌరవాన్ని కూడా పొంది చరిత్ర సృష్టించారు సింగర్ అర్జిత్ సింగ్. సినిమాలలో అర్జిత్ సింగ్ గొంతు మూగబోతుందన్న వార్త తెలియగానే సంగీత ప్రియులు అందరూ ఎమోషనల్ అవుతున్నారు. కాగా తెలుగులో మనం, ఉయ్యాల జంపాల, స్వామి రారా లాంటి చాలా సినిమాలకు అర్జిత్ సింగ్ పాటలు పాడారు.

Next Story