భార్యతో విభేదాలు.. ఇల్లు తుడుస్తూ కనిపించిన హీరో.. నువ్వు గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)

by Mallepaka Hamsa |

స్టార్ హీరోయిన్లు, హీరోల ఇంట్లో పనులు చేయడానికి చాలా మంది పనులవాల్లు ఉంటారు.

భార్యతో విభేదాలు.. ఇల్లు తుడుస్తూ కనిపించిన హీరో.. నువ్వు గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్లు, హీరోల ఇంట్లో పనులు చేయడానికి చాలా మంది పనులవాల్లు ఉంటారు. వంట, ఇంటి పనులు, కారు కోసం అలా సెపరేట్‌గా వర్క్ చేసేవారిని నియమించుకుంటారు. తమకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారికి లక్షల జీతం ఇచ్చి మరీ పనులు చేయించుకుంటుంటారు. అయితే ఓ హీరో మాత్రం తన ఇంట్లో పని తానే చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇల్లు తుడుస్తున్న హీరోను చూసిన నెటిజన్లు ఆయన సింపుల్‌గా ఉండటం చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఆయన ఎవరు.. ఎందుకలా చేశాడో ఇక్కడ తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళితే.. తమిళ హీరో రవి మోహన్(Ravi Mohan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇటీవల ‘కాదలిక్క నేరమిళ్లై’ (Kadhalikka Neramillai)చిత్రంలో నటించాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ ‘మదరాసి’ (madarasi)మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక రవి మోహన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆర్తిని ప్రేమించి 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే గత ఏడాది వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులుకు దరఖాస్తు చేసుకున్నారు.

కోర్టులో ఈ కేసు నడుస్తోంది. అయితే జయంరవి మాత్రం వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఆయన ఇల్లు తుడుస్తున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘సొంతంగా ఇంటిని శుభ్రం చేసుకోవడమే నా పని. అదేంటో కానీ ఈ పని చేస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు నువ్వు గ్రేట్ అన్నా అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story