హీరో 'దివాలా తీశారని ప్రకటించడానికి సిద్ధమా.. నటుడు విశాల్‌పై హైకోర్టు ఆగ్రహం

by Malleboina Mahesh |

తమిళ నటుడు, నిర్మాత విశాల్‌పై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

హీరో దివాలా తీశారని ప్రకటించడానికి సిద్ధమా.. నటుడు విశాల్‌పై హైకోర్టు ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు, నిర్మాత విశాల్‌పై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థకు చెల్లించాల్సిన బాకీ విషయంలో దాఖలైన అప్పీల్‌పై విచారణ సందర్భంగా, "తాను ధనవంతుడని కాదని విశాల్ కోర్టుకు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కోర్టు హీరో విశాల్ దివాలా తీశారని (Insolvent) ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా?" అని హైకోర్టు ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.

అసలేం జరిగిదంటే..?

హీరో విశాల్ తన నిర్మాణ సంస్థ ద్వారా లైకా ప్రొడక్షన్స్ నుండి గతంలో ఆర్థిక సహాయం తీసుకున్నారు. తర్వాత వివిధ కారణాలతో అతను ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో లైకా ప్రొడక్షన్స్ వారు కోర్టును ఆశ్రయింగచా.. విచారణ చేపట్టిన కోర్టు.. లైకా సంస్థకు ఇవ్వాల్సిన రూ. 21.29 కోట్ల మొత్తాన్ని, 30 శాతం వడ్డీతో చెల్లించాలని మద్రాసు హైకోర్టు గతంలో విశాల్‌ను ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ, విశాల్ తన సొంత నిర్మాణంలో వచ్చిన ‘వాగై సూడుం’ చిత్రాన్ని స్వయంగా విడుదల చేయడంతో, లైకా ప్రొడక్షన్స్ కోర్టును ఆశ్రయించింది.

కోర్టులో వాదనలు

తాజాగా ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ విశాల్ దాఖలు చేసిన అప్పీల్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, విశాల్ తరపున హాజరైన న్యాయవాదులు తమ క్లయింట్ (విశాల్) ధనవంతుడు కాదని కోర్టుకు తెలిపారు. ఈ వాదనపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం, విశాల్ ధనవంతుడు కాకపోతే, "అయితే, విశాల్ దివాళా తీసినట్టుగా ప్రకటించేందుకు సిద్ధమా?" అని నిలదీసింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story