- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Celebrities : సెలబ్రిటీస్ తెలిసే తప్పు చేస్తున్నారా.. నోరు జారి క్షమాపణలు అంటూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న నటీ నటులు?
అసలు మాటలు జారడం ఎందుకు ? మళ్ళీ సారీ చెప్పడం దేనికి అంటూ జనాలు మండిపడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు సినిమాలకు విలువ ఉండేది. కానీ, ఇప్పుడు మనిషి జీవితం మీద ప్రభావం చూపించే చిత్రాలను తీస్తున్నారు. ఒకానొక సమయంలో సపోర్ట్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు మాత్రం అస్సలు అలాంటి సినిమాలను చూడటం లేదు. కథ మంచిగా ఉంటేనే థియేటర్ కి వెళ్ళి చూస్తున్నారు. లేదంటే ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ తో సరిపెట్టుకుంటున్నారు. ఒక సినిమా హిట్ అయితే చాలు ఎవరికి వారు సెలబ్రిటీస్ అనే టాగ్ తగిలించుకుని పబ్లిక్ లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. కొన్ని సందర్భాలలో కావాలనే తప్పు చేసి క్షమాపణలు చెప్పడానికి కూడా వెనుకాడటం లేదు. ఫేమస్ అవ్వడానికి సెలబ్రిటీస్ తెలిసే తప్పుచేస్తూ.. కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
సెలబ్రిటీస్ కు జనాలను చూస్తే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుందనుకుంటా .. నోరు కూడా అదుపులో పెట్టుకోకుండా ఒక్క రాత్రి లోనే ఫేమస్ అవ్వాలని డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు. మీకు ఏం అనిపించిందమో కానీ, చూసే వాళ్లకు మరి ఇంతలా దిగజారిపోయి మాట్లాడటం అవసరమా అని అనిపిస్తుంది. తప్పులు చేసుకుంటూ వెళ్లడం .. సారీ అని మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం. గత కొద్దీ రోజుల నుంచి ఇదే నడుస్తుంది. నలుగురు జనాలను చూసి ఏదోకటి మాట్లాడడం, ఆ తర్వాత తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడం, ఇప్పుడు ఇది ట్రెండ్ లాగా అయిపోయింది. అలాంటి ఘటనలు టాలీవుడ్ లో జరిగినవి కొన్ని ఇక్కడ చూద్దాం..
బిగ్‌బాస్ ఫేమ్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి ( shiva jyothi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈమె ఓ వీడియోలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. పెద్ద దున్నపోతు దగ్గర నిలబడి " దేశంలోనే ఇది పెద్ద దున్నపోతు.. అచ్చం నువ్వు ప్రభాస్ అన్నలాగా దిట్టంగా ఉన్నావ్ " అంటూ నోరు జారింది. ఈ మాటలకు ప్రభాస్ ఫాన్స్ అయితే ఆమెపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫంక్షన్లో శ్రీముఖి ( Sreemukhi ) "రామలక్ష్మణులు" ఫిక్షనల్ అంటూ మాట జారింది. ఒక్క దెబ్బకు ఆమెను ఫుల్ ట్రోల్ చేశారు. దాంతో తన తప్పు తెలుసుకున్న యాంకరమ్మ వెంటనే క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. ఎన్నో ఏళ్ళ నుంచి సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకెళ్తున్న దిల్ రాజుకి ( Dil Raju ) కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. తెలంగాణ సంస్కృతి గురించి అవమానిస్తూ తెల్లకల్లు, మటన్ ముక్కా అంటూ నోరు జారి, తర్వాత క్షమాపణలు చెప్పాడు. అసలు మాటలు మాటలు జారడం ఎందుకు ? మళ్ళీ సారీ చెప్పడం దేనికి అంటూ జనాలు మండిపడుతున్నారు.






