- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది నాకు చాలా సంతృప్తి కలిగించింది.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అర్చన శాస్త్రీ, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కర్మస్థలం’.

దిశ, సినిమా: అర్చన శాస్త్రీ(Archana Shastri), మితాలి చౌహాన్ (Mithali Chauhan), వినోద్ అల్వా (Vinod Alva), కాలకేయ ప్రభాకర్ (Kalakeya Prabhakar), బలగం సంజయ్ (Strength Sanjay), నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కర్మస్థలం’(Karmasthalam). రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయబోతున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో కనిపించిన పాత్రలు, ఆ పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు భయంకరంగా ఆకట్టుకునేలా ఉంది. ఇక అర్చనా లుక్, గెటప్ ఈ పోస్టర్‌లో హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్‌లో అమ్మవారి షాడో కనిపించడం చూస్తుంటే.. ఈ సినిమా కథపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ లాంచ్ అనంతరం హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. ‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంత మంచి సబ్జెక్ట్‌ని, కర్మ స్థలం వంటి అద్భుతమైన టైటిల్‌తో సినిమాను తెరకెక్కించిన రాకీకి థాంక్స్. కథను చెప్పేందుకు వచ్చినప్పుడు రాకీని చూసి కొత్త వాడు కదా.. ఎలా తీస్తారో అని అనుకున్నాను. కానీ కథను అద్భుతంగా నెరేట్ చేశారు. క్వాలిటీ పరంగా ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమిది. ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. పోస్టర్ ఎంత ప్రభావం చూపిస్తోందో.. సినిమా కూడా అంతే ప్రభావం చూపించబోతోంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.






