భారీ డీల్ కుదుర్చుకున్న ఏఆర్ రెహమాన్.. ‘రామాయణ’కు హైయెస్ట్ రెమ్యూనరేషన్

by Pulgam srinivas |

రామాయణకు ఏఆర్ రెహమాన్ భారీ డీల్.. ₹30 కోట్లతో పాటు ప్రాఫిట్ షేరింగ్

భారీ డీల్ కుదుర్చుకున్న ఏఆర్ రెహమాన్.. ‘రామాయణ’కు హైయెస్ట్ రెమ్యూనరేషన్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న రామాయణ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యాష్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ చిత్రాన్ని ఏకంగా ₹4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం.

అంతేకాకుండా, ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం ₹30 కోట్ల భారీ పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ సినిమాకు వచ్చే లాభాల్లో వాటాను (ప్రాఫిట్ షేరింగ్) కూడా ఆయన తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏ భారతీయ సంగీత దర్శకుడు కూడా ఒక్క సినిమాకు ఇంత భారీ పారితోషకం తీసుకోలేదని, ఇది ఒక రికార్డు స్థాయి డీల్గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా, భారీ తారాగణం, అద్భుతమైన సాంకేతికత, గ్రాండ్ మేకింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Next Story