AR Rahman: ఆ సినిమా హిట్ తర్వాతే తెలుగులో మూవీ చేయాలనుకున్నాను

by Pulgam srinivas |

ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘బాహుబలి’ సినిమా విజయం సాధించిన తర్వాత తెలుగులో నేరుగా సినిమా చేయాలనే ఆసక్తి కలిగిందని తాజాగా చెప్పుకొచ్చారు.

AR Rahman: ఆ సినిమా హిట్ తర్వాతే తెలుగులో మూవీ చేయాలనుకున్నాను
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఇప్పటివరకు ఎన్నో చిత్రాలకు సంగీతం అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. తాజాగా రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న భోపాల్లో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగా అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ ఈవెంట్‌లో రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రెహమాన్ మాట్లాడుతూ.. నేను సంగీతం అందించిన ఎన్నో తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఆ చిత్రాల సంగీతాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. బాహుబలి సినిమా విజయం సాధించిన తర్వాత నాకు తెలుగులో నేరుగా సినిమా చేయాలనే కోరిక కలిగింది. ఆ తర్వాత ఒక రోజు బుచ్చిబాబు, సుకుమార్ కలిసి నన్ను ‘పెద్ది’ సినిమా కోసం సంప్రదించారు. కథ నాకు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాను. ‘పెద్ది’ అద్భుతమైన సినిమా అవుతుంది. ఇందులో రామ్ చరణ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని రెహమాన్ చెప్పుకొచ్చారు. తాజాగా రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story