పెద్ది నుంచి “అప్పల సూరి” వచ్చేశాడు.. జగపతిబాబు నుంచి ఇది ఊహించి ఉండరు

by Pulgam srinivas |

పెద్దిలో ‘అప్పల సూరి’ పాత్రతో ఆకట్టుకున్న జగపతిబాబు

పెద్ది నుంచి “అప్పల సూరి” వచ్చేశాడు.. జగపతిబాబు నుంచి ఇది ఊహించి ఉండరు
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మే 18న రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్న నటీనటులకు సంబంధించిన చిన్న చిన్న వీడియోలను మేకర్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన శివరాజ్ కుమార్, దివ్యేందులకి సంబంధించిన వీడియోలను విడుదల చేశారు.

తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న జగపతిబాబుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. జగపతిబాబు ఈ సినిమాలో ‘అప్పల సూరి’ పాత్రలో కనిపించబోతున్నారు. కొంతకాలం క్రితమే ఈ చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు. ఆ పోస్టర్లలో జగపతిబాబు లుక్ పూర్తిగా భిన్నంగా ఉండటంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన వీడియోను చూస్తే ఆయన ఈ సినిమాలో వయసు మళ్లిన వ్యక్తి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

జగపతిబాబు తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించినప్పటికీ, ఇలాంటి వయసు మళ్లిన పాత్రలో ఎక్కువగా కనిపించలేదు. దీంతో ఒక్క వీడియోతోనే ఆయన పాత్రపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ట్రైలర్ విడుదలైన తర్వాత జగపతిబాబు పాత్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.


Next Story