విజయవంతంగా ముగిసిన APL లీగ్.. ప్రధాని మోడీని కలిసిన రామ్‌చరణ్ దంపతులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-11 16:13:11  IST  )

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), సతీమణి ఉపాసన కొణిదెల ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు.

విజయవంతంగా ముగిసిన APL లీగ్.. ప్రధాని మోడీని కలిసిన రామ్‌చరణ్ దంపతులు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), సతీమణి ఉపాసన కొణిదెల ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచంలో మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) మొదటి సీజన్ విజయవంతగా ముగిసిన సందర్భంగా వారు ప్రధానిని కలిశారు. వారి వెంట ఉపాసన తండ్రి అనిల్ కామినేని, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వీరేందర్ సచ్దేవా, APL ప్రతినిధులు ఉన్నారు. అయితే, రామ్‌చరణ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతూ ఈవెంట్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేస్తూ కీలక పాత్ర పోషించారు. APL తొలి సీజన్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా APL ప్రతినిధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక సింబాలిక్ బౌ ని అందజేశారు.

కాగా, అనిల్ కామినేని నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ భారతీయ ప్రాచీన క్రీడ అయిన విలు విద్యను (Archery) తిరిగి దేశ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చే లక్ష్యంతో సాగుతోంది. ప్రపంచ స్థాయి శిక్షణ, పోటీ వేదికలు, అంతర్జాతీయ గుర్తింపు, ఈ మూడు మార్గాల ద్వారా భారత విలువిద్యాకారులకు అవకాశాలను అందించడం APL ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. తాము ప్రధానని మంత్రిని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వెనుక ఉన్న విజన్‌ను పంచుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. విలువిద్య మన సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగమని, APL ద్వారా దాన్ని తిరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలన్నది తమ ఆశయమని అన్నారు. భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉందని.. ఔత్సాహికులకు ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడుతుందని రామ్‌చరణ్ అన్నారు. ఈ సందర్భంగా కొణిదెల ఉపాసన అత్తా, మామ చిరంజీవి, శ్రీమతి సురేఖ తరఫున ప్రధాన మంత్రికి బాలాజీ విగ్రహంతో పాటు సంప్రదాయ పూజా కిట్‌ను బహూకరించారు.

Next Story