- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుమార్తె వామిక విరాట్ కోహ్లీకి క్యూట్ విష్.నెట్టింట వైరలవుతోన్న అనుష్క పోస్ట్
బాలీవుడ్ స్టార్ నటీమణుల్లో అనుష్క శర్మ ఒకరు. ఈ నటి అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ నటీమణుల్లో అనుష్క శర్మ ఒకరు. ఈ నటి అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీకి కోట్లలో అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక సినిమాల్లో నటించే క్రమంలోనే అనుష్క శర్మ.. ప్రముఖ భారత క్రికెటర్ అయిన విరాట్ కోహ్లితో ప్రేమలో పడింది. ఇక వీరిద్దరు పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. వివాహనంతరం నటి అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పింది. భర్తకు మద్దతుగా నిలుస్తూ.. పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉత్తమ భార్యగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంటుంది. అనుష్క తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అయితే తాజాగా ఈ నటి సోషల్ మీడియా వేదికన ఫాదర్స్ డే సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నేను ప్రేమించిన మొదటి వ్యక్తికి, మా కూతురు ప్రేమించిన మొదటి వ్యక్తికి.. ప్రతిచోటా ఉన్న అందమైన తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు’’ అని తన నాన్న ఫొటో పంచుకుని క్యూట్ విష్ చేసింది. అలాగే తన పాప విరాట్‌కు బుక్ పై రాసి విష్ చేసినది కూడా పంచుకుంది. instagram lilnk






