- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుష్క శెట్టి ‘కథనార్’ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది
అనుష్క శెట్టి, జై సూర్య జంటగా నటించిన మలయాళ చిత్రం ‘కథనార్’ అఫీషియల్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

దిశ, సినిమా: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి నటించిన మలయాళ చిత్రం ‘కథనార్’. భారీ బడ్జెట్‌తో 3D టెక్నాలజీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జైసూర్య హీరోగా కనిపించనున్నాడు. మలయాళంతో పాటు తెలుగు , తమిళం, హిందీ, ఇంగ్లీష్‌తో సహా ఏకంగా 15 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న ఈ పౌరాణిక కథాశం నుంచి తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘మౌనాన్ని ఛేదించడానికి ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది.. అఫీషియల్ ట్రైలర్ మార్చి 31న 13:31 గంటలకు రాబోతున్నది’ అంటూ ప్రకటించారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. అనుష్క విధ్వంసం కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
కాగా.. రామానంద్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇది మొదటిది. 9వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనాత్ జీవితం ఆదారంగా రూపొందుతోన్న ఈ మూవీలో అనుష్క శెట్టి ‘నీలా’ పాత్రలో కనిపించనుంది. శ్రీ గోకులం మూవీస్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. కస్టమ్-బిల్డ్ స్టూడియోలో వర్చువర్ ప్రొడక్షన్ టెక్సాలజీని ఉపయోగించి చిత్రీకరించబడింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 2023లోనే స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అనుష్క శెట్టి ఫ్యాన్స్.






