అనుష్క ‘ఘాటి’ పోస్ట్ పోన్ అంటూ వార్తలు.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన టీమ్

by Chukka Sudharani |   (  Updated:2025-07-05 13:28:47  IST  )

హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘ఘాటి’(Ghaati).

అనుష్క ‘ఘాటి’ పోస్ట్ పోన్ అంటూ వార్తలు.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన టీమ్
X

దిశ, సినిమా: హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘ఘాటి’(Ghaati). తమిళ నటుడు విక్రమ్ ప్రభు (Vikram Prabhu)ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. ఈ సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, భాషల్లో జూలై 11న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు చిత్ర బృందం. కానీ, ఇప్పుడు మరోసారి వాయిదా వేసి ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరిచారు.

ఈ మేరకు X వేదికగా.. ‘ఘాటి నుండి ఒక గమనిక.. సినిమా ఒక జీవ నది. కొన్నిసార్లు అది ముందుకు దూసుకుపోతుంది.. కొన్నిసార్లు మరింత డెప్త్ కోసం ఆగిపోతుంది. ఘాటి కేవలం సినిమా కాదు.. ఇది ఒక పర్వత ప్రతిధ్వని. ఒక అడవి గాలి.. రాళ్లు, మట్టి నుండి చెక్కబడిన కథ. అందుకే.. దీనికి మరింత గొప్పగా తీసుకొచ్చేందుకు ఇంకొంచెం సమయం పడుతోంది. ఈ నిరీక్షణ అనుభవాన్ని.. మరింత గొప్పగా, మెమోరబుల్‌గా తీర్చిదిద్దగలమని మేము నమ్ముతున్నాము. మీ ప్రేమకు, మీ ఓపికకు.. మాతో ఈ బాటలో నడుస్తున్నందుకు ధన్యవాదాలు’ అని నోట్ షేర్ చేశారు.

ట్వీట్:

Next Story